Politics8th Aug 03:12 PMSunil Byrisetty1 min read

అభివృద్ధి చేస్తే ఓట్లా? మాజీ సీఎం లెసన్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన నియోజకవర్గంలో ఎదురైన అనుభవాన్ని పేర్కొన్నారు. తన నియోజకవర్గమైన పీలేరులోని మం

అభివృద్ధి చేస్తే ఓట్లా? మాజీ సీఎం లెసన్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన నియోజకవర్గంలో ఎదురైన అనుభవాన్ని పేర్కొన్నారు. తన నియోజకవర్గమైన పీలేరులోని మంచాలమంద అనే రిమోట్ గ్రామానికి కనీసం రోడ్డు, బస్సు సౌకర్యాలు కూడా లేవన్నారు. తాను ఆ ఊరిని ఆదర్శ గ్రామంగా మార్చానన్నారు. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఎన్నికల ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ నేతలకు గెలుపోటములు సహజమని, ఏం చేస్తే ప్రజలు గెలిపిస్తారు?.. అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారా? అనే అంశంపై చక్కటి ఉదాహరణను చెప్పారు. తన అనుభవంతో చెబుతున్నానని అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘రాజకీయం అనేది కష్టమైన విషయం, ఫార్ములా ఏమీ ఉండదు. ఇది చేస్తే మనం గెలుస్తాం, ఇది చేస్తే మనం ఓడిపోతామనే ఫార్ములా ఉండదు. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే గెలుస్తాము, ఓడిపోతాము. ఇక్కడ భగవంతుడు ఓటరు మహాశయులు.. ఓటరు మహాశయులు తలచుకుంటే గెలుస్తాము, వాళ్లు తలచుకోకపోతే ఓడిపోతాము' అని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh
Kiran Kumar Reddy
Former Chief Minister
Andhra Pradesh
Pileru
Politics
Elections
ఎన్నికలు
రాజకీయ పాఠం
అభివృద్ధి
ఓటర్లు
ఏపీ రాజకీయాలు
Scroll for the next article