Electronics30th Nov 03:41 PMSunil Byrisetty1 min read

మీ ల్యాప్‌టాప్‌లో వైరస్ ఉందా? తెలుసుకోండిలా..

వేగంగా పని చేసే ల్యాప్‌టాప్ పనితీరు స్లో అయిందా? మాటిమాటికీ సిస్టమ్ క్రాష్ అవుతోందా? సంబంధం లేని యాడ్స్ మీకు నోటిఫికేషన్ల తరహాలో వస్తున్నాయా? వీటికి కారణం వైరస్ కావచ్చు. ఇలాంటి సమయ

మీ ల్యాప్‌టాప్‌లో వైరస్ ఉందా? తెలుసుకోండిలా..
వేగంగా పని చేసే ల్యాప్‌టాప్ పనితీరు స్లో అయిందా? మాటిమాటికీ సిస్టమ్ క్రాష్ అవుతోందా? సంబంధం లేని యాడ్స్ మీకు నోటిఫికేషన్ల తరహాలో వస్తున్నాయా? వీటికి కారణం వైరస్ కావచ్చు. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది చూద్దాం. మీ ల్యాప్‌టాప్‌లో వైరస్ లేదా మాల్వేర్ ఎంటర్ అయితే ల్యాప్‌టాప్‌ పదే పదే క్రాష్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా యాప్‌లు సరిగ్గా పనిచేయవు. ఇలాంటి సమయంలో వెంటనే జాగ్రత్త పడకపోతే నష్టం జరుగుతుంది. ఇక ల్యాప్‌టాప్‌లోకి ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు సంబంధం లేని పాప్-ఆప్ యాడ్స్ కనిపిస్తాయి. ఏవేవో యాడ్స్ నోటిఫికేషన్స్ రూపంలో వస్తూనే ఉంటాయి. ఈ యాడ్స్‌పై మీరు క్లిక్ చేయడం వల్ల మీ డేటా థెఫ్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే జాగ్రత్త పడండి. ల్యాప్‌టాప్ క్రమక్రంగా స్లో అవుతున్నా వైరస్ ప్రవేశించినట్లు అర్ధం. మీరు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా షట్‌డౌన్ చేసినప్పుడు ప్రక్రియ ఆలస్యం కావడం, ఏదైనా ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఆలస్యంగా తెరుచుకోవడం లాంటి సమస్యలు ఎదురైనా వైరస్ చేరినట్లు గమనించాలి. దీనికోసం ప్రస్తుతం మార్కెట్‌లో అనేక యాంటీ వైరస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కొనుగోలు చేసి మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసి స్కాన్ చేయండి. దాని వల్ల మీ సిస్టమ్ నుంచి వైరస్‌ను తొలగించుకోవచ్చు.
Laptop Virus
Malware
System Slowdown
System Crash
Pop-up Ads
Notification Ads
Data Theft
Antivirus Software
Laptop Security
Tech Tips
Scroll for the next article