News10th Nov 05:47 PMSunil Byrisetty1 min read
సీఐఐ సదస్సుకు దేశ, విదేశీ సంస్థల ప్రతినిధులు
విశాఖపట్నంలో 2 రోజులపాటు నిర్వహించే సీఐఐ సదస్సుకు పెద్దఎత్తున దేశ, విదేశీ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్ారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు హాజరై ప్రసంగించనున్నారు. 14,
విశాఖపట్నంలో 2 రోజులపాటు నిర్వహించే సీఐఐ సదస్సుకు పెద్దఎత్తున దేశ, విదేశీ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్ారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు హాజరై ప్రసంగించనున్నారు. 14, 15 తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సులో ప్రధానంగా 7 అంశాలపై దృష్టి సారించనున్నారు. ట్రేడ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, జియో ఎకనమిక్ ఫ్రేమ్ వర్క్ అంశాలపై చర్చ జరపనున్నారు. సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ యాక్షన్, టెక్నాలజీ, ఇన్నొవేషన్‌పై చర్చ నిర్వహిస్తారు. సదస్సుకు 50కి పైగా దేశాల నుంచి 2500కు పైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు చెందిన వారికి ఆహ్వానం పలికారు. భాగస్వామ సదస్సులో 45కు పైగా సెషన్లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. సదస్సు తొలి రోజునే సుమారు 25 సెషన్లు జరిగే అవకాశం ఉంది. భారీఎత్తున ఒప్పందాలు కుదుర్చుకునేలా ఇప్పటికే సంస్థలతో సంప్రదింపులు జరిపారు.