TTD24th Jan 10:42 AMSunil Byrisetty1 min read
టీటీడీకి రూ.2.50 కోట్లు విరాళం
హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్ట్స్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది. ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు
హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్ట్స్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది.
ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాజ గోపాల రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.