News19th Jul 09:53 AMSunil Byrisetty1 min read
వర్షాల కోసం గాడిదల పెళ్లి
వర్షాల కోసం కప్పల పెళ్లి చేయడం చూసే ఉంటాం. ఏపీలో ఏకంగా గాడిదల పెళ్లి చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లిలో గ్రామస్థులు వర్షాలు కురవాలని గాడిదలకు శాస్త్రోక్తంగా వి
వర్షాల కోసం కప్పల పెళ్లి చేయడం చూసే ఉంటాం. ఏపీలో ఏకంగా గాడిదల పెళ్లి చేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లిలో గ్రామస్థులు వర్షాలు కురవాలని గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.
డప్పుల మోతతో ఊరేగింపు నిర్వహించి, గాడిద దంపతులపై నీళ్లు పోశారు. గతంలో ఇలా చేయగా వర్షాలు పడ్డాయని, ఈసారి కూడా మంచి వర్షాలు కురుస్తాయని గ్రామస్థులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.