Politics10th Jul 04:33 PMSunil Byrisetty1 min read
వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. కవ్విస్తే రెచ్చిపోవద్దు
ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వైసీపీ నేతలు కూటమి ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతల కవ్వింపులకు రెచ్చిపోవద్దని మంత్రులకు సూచించ
ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. వైసీపీ నేతలు కూటమి ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతల కవ్వింపులకు రెచ్చిపోవద్దని మంత్రులకు సూచించారు. వాళ్ల ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల చోటు చేసుకున్న అనంతపురం సహా పలు జిల్లాల ఘటనలను ప్రస్తావించారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచనలు చేశారు. ఇన్‌చార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.