National5th Jan 05:05 PMSunil Byrisetty1 min read
ఏఐతో వృత్తి జీవితానికి హాని అనే అపోహలొద్దు
ఏఐపై రకరకాల ఆందోళనలు నెలకొన్న వేళ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన బ్లాగులో అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐతో వృత్తి జీవితానికి హాని కలుగుతుందనే వాదనలను ఆ
ఏఐపై రకరకాల ఆందోళనలు నెలకొన్న వేళ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన బ్లాగులో అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐతో వృత్తి జీవితానికి హాని కలుగుతుందనే వాదనలను ఆపేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సాంకేతికతకు సంబంధించి, ప్రతి ఒక్కరూ కొత్తదనపు దశను అధిగమించి, వాస్తవ ప్రపంచంపై దాని ప్రభావం పట్ల దృష్టి సారించాలని పేర్కొన్నారు. మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. అయితే ఇది మానవులకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా వేలాది కంపెనీలకు సేవలందించిన ఆఫీస్, విండోస్ సాఫ్ట్‌వేర్ స్థానంలో ఏఐ ఏజెంట్లను వినియోగించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోందని ఆయన తెలిపారు. కోపైలట్, అనుబంధ ఉత్పత్తులను బలోపేతం చేయడానికి, మరింత ఆధునిక ఏఐ నమూనాలపై మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడుతోందని ఆయన వెల్లడించారు.