News24th Aug 02:55 PMSunil Byrisetty1 min read
కోట్ల విలువైన భూమి ఏపీఐఐసికి వద్దు: లోక్ సత్తా
ఉత్తరాంధ్రలోని మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీల విలువైన భూములను ఏపీఐఐసికి అప్పగించవద్దని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర
ఉత్తరాంధ్రలోని మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీల విలువైన భూములను ఏపీఐఐసికి అప్పగించవద్దని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర్ వి. వెంకటరావుని కలిసి వినతి పత్రం అందచేసి కోరారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూత పడ్డ తాండవ, ఏటి కొప్పాక, భీమసింగి సుగర్ ఫ్యాక్టరీలపై క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకటించి గ్రూప్ అఫ్ మినిస్టర్స్ని కూడా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తాండవ సుగర్ ఫ్యాక్టరీకి 39 ఎకరాలు, ఏటి కొప్పాక కి 72 ఎకరాలు, భీమసింగి కి 73 ఎకరాల భూమి ఉందని మూడు ఫ్యాక్టరీలకి కలిపి సుమారు 50 కోట్ల విలువైన పాడుబడ్డ యంత్ర సామాగ్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 2,500 కోట్ల రూపాయల విలువ గల ఆస్థి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇందులో ప్రభుత్వరంగ పరిశ్రమలు పెట్టి యువత కి ఉపాధి చూపించ వచ్చని భీశెట్టి అభిప్రాయపడ్డారు. ఏపీ ఐఐసి భూములు అమ్మకాలు ప్రారంభిస్తే కొనుగోలు దారులు సిండికెట్ అయ్యి తక్కువ రేటుకే విలువైన భూములు కొట్టేసే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.