News19th Jul 04:48 PMSunil Byrisetty1 min read
ఆర్టీసీ స్థలాలను లూలూకి కట్ట పెట్టొద్దు!
లూలూ మాల్ కు విజయవాడ ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలం అప్పగించే ప్రతిపాదనలు ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సిపిఎం విస
లూలూ మాల్ కు విజయవాడ ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలం అప్పగించే ప్రతిపాదనలు ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సిపిఎం విస్తృత సమావేశంలో 400 కోట్ల రూపాయలు పైగా విలువైన విజయవాడ పాత బస్టాండ్, ఇతర ఆర్టీసీ స్థలాలను బడా, బహుళ జాతి కంపెనీ అయిన లూలూ కంపెనీకి మాల్ నిర్మాణం కొరకు కేటాయించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయటం శోచనీయమన్నారు. సాధారణ ప్రజలకు రవాణా సదుపాయం కలిగించే ఆర్టీసీ సంస్థకు ఆర్థిక సహాయం చేసి, అన్ని విధాలా బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను నాశనం చేసేందుకు విలువైన స్థలాలను బడా కంపెనీలకు కట్టబెట్టడం తగదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు ఆర్టీసీ డిపోలు నడుస్తున్న ఈ స్థలాన్ని లూలూ కంపెనీకి దారా దత్తం చేయడం చేయటం అంటే ఆర్టిసి సంస్థను, ప్రజా రవాణాను దెబ్బతీయటమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మెట్రో తదితర ప్రజా రవాణా వ్యవస్థల ఏర్పాటు కోసం ప్రైవేటు వ్యక్తుల నుండి భూములు సేకరిస్తున్న ప్రభుత్వం, మరోవైపు ప్రభుత్వ సంస్థల భూములను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం దారుణమని, దీనిపై ఉద్యమిస్తామని ప్రకటించారు.