Politics6th Aug 04:56 PMSunil Byrisetty1 min read

మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ముడిపెట్టొద్దు

మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ముడిపెట్టొద్దని, వాటిని విడదీసి మహిళా బిల్లు విడిగా పెడితే ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నార

మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ముడిపెట్టొద్దు
మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ముడిపెట్టొద్దని, వాటిని విడదీసి మహిళా బిల్లు విడిగా పెడితే ఆమోదించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. ఈ రెండిటినీ కలిపి పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు మహిళా బిల్లును అడ్డుకుంటున్నాయనే తప్పుడు ప్రచారం చేసేందుకు, బిజెపి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తోందనీ అన్నారు. డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం లేదని, ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదించలేదని తెలిపారు.పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. వారికి కిలోకు రూ.250కు కొని న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పడం, కిలోకు అదనంగా రూ.10 ఇస్తామనడం వారిని మోసం చేయడమేనని తెలిపారు. పొగాకు కొనకపోడంతో పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వారితో సహా రైతులంతా ఆందోళనలో పాల్గొంటున్నారని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులిచ్చి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
B.V. Raghavulu
CPM
Women's Reservation Bill
Delimitation
BJP
Opposition
రాజకీయాలు
పొగాకు రైతులు
ఆంధ్రప్రదేశ్
రాజకీయ వార్తలు
పార్లమెంట్
సీపీఐఎం
Scroll for the next article