Education28th Aug 02:49 PMSunil Byrisetty1 min read

గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు

తల్లిదండ్రుల అనుమతి లేకుండా గిరిజన విద్యార్థులను వేరే ప్రాంతాలకు తరలించడం అత్యంత బాధ్యతారాహిత్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం మారికవలస గిరిజన గ

గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు
తల్లిదండ్రుల అనుమతి లేకుండా గిరిజన విద్యార్థులను వేరే ప్రాంతాలకు తరలించడం అత్యంత బాధ్యతారాహిత్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల (ఎపిటిడబ్ల్యూఆర్) పాఠశాలలో చదువుతున్న 480 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. 25వ తేదీ అర్ధరాత్రి నుంచి తల్లిదండ్రులకు ఫోన్‌లు చేసి, 26వ తేదీ తెల్లవారుజామున విద్యార్థులను బస్సుల్లో బలవంతంగా తరలించడం, పోలీసులతో భయభ్రాంతులకు గురిచేయడం, వారి సామాన్లను బయటకు పడేయడం వంటి చర్యలు అత్యంత బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ పేరుతో కోచింగ్ సెంటర్ పెట్టడానికి గిరిజన పాఠశాలను తరలించడం విజ్ఞత కాదన్నారు. 480 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AP Tribal Welfare Residential School
Tribal Students
Tribal Education
CPM
V Srinivasa Rao
Andhra Pradesh
Visakhapatnam
Marikavalasa
Tribal Gurukulam School
ఏపీటీడబ్ల్యూఆర్
విద్య
విద్యార్థుల సంక్షేమం
పాఠశాల తరలింపు
గిరిజన సంక్షేమం
Scroll for the next article