News24th Jan 04:42 PMSunil Byrisetty1 min read
దూరదర్శన్లో స్ట్రింగర్లకు నోటిఫికేషన్
ఏపీలోని అన్ని జిల్లాల్లో వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల(స్ట్రింగర్లు) ఎంప్యానల్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విజయవాడ డీడీకే హెడ్ ఆఫ్ న్యూస్ షఫీ మహమ్మద్ తెలిపారు. జిల్లా స
ఏపీలోని అన్ని జిల్లాల్లో వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల(స్ట్రింగర్లు) ఎంప్యానల్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విజయవాడ డీడీకే హెడ్ ఆఫ్ న్యూస్ షఫీ మహమ్మద్ తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగే వార్తలు, ప్రస్తుత వ్యవహారాలు, క్రీడలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని సేకరించి దూరదర్శన్ కు అందించాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులను విజయవాడలోని ప్రాంతీయ వార్త విభాగంలో సమర్పించాలని కోరారు. నోటిఫికేషన్ కోసం https://prasarbharati.gov.in/ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో స్ట్రింగర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.