News6th Sep 08:54 AMSunil Byrisetty1 min read
విశాఖలో డబుల్ డెక్కర్ మెట్రో!
విశాఖపట్నంలో మూడు కారిడార్లలో మెట్రో నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రూ.6250 కోట్లతో ప్రాజెక్టును నిర్మించనున్నట్లు టెండర్లలో పేర్కొంది. ఈ మేరకు అమరావతి మెట్రో రై
విశాఖపట్నంలో మూడు కారిడార్లలో మెట్రో నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రూ.6250 కోట్లతో ప్రాజెక్టును నిర్మించనున్నట్లు టెండర్లలో పేర్కొంది. ఈ మేరకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ అంతర్జాతీయ పోటీ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 12వ తేదీతో టెండర్ గడువు ముగియనుంది. ఈ ప్రాజెక్టులో విశాఖలో మొత్తం 46.23 కిలోమీటర్ల దూరం కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో 20.16 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ నాలుగులైన్ల ఫ్లైఓవర్ ఉండనుంది. 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు.