News7th Nov 02:30 PMSunil Byrisetty1 min read
విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్!
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి ప్రతిపాదిత డీపీఆర్ పై జాతీయ రహదారుల శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నం - విజయవాడ నేషనల్ హైవేను 6 లైన్లకు ప
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి ప్రతిపాదిత డీపీఆర్ పై జాతీయ రహదారుల శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నం - విజయవాడ నేషనల్ హైవేను 6 లైన్లకు పెంచేందుకు రూపొందించిన డీపీఆర్ పై చర్చించారు. ప్రతిపాదిత డీపీఆర్ లో బెంజి సర్కిల్ నుంచి భవిష్యత్తులో రాబోయే ఓఆర్ ఆర్ వరకు ఎటువంటి అండర్ పాస్, ప్లై ఓవర్ల ప్రస్తావన లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికంగా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నుంచి పెనమలూరు వరకు భవిష్యత్తులో మెట్రో ఏర్పాటుకు నిర్ణయిస్తే.. దానిని డబుల్ డెక్కర్ గా ప్రతిపాదించాలని ప్రజాప్రతినిథులు, కలెక్టర్లు సూచించారు.