News25th Jan 11:06 AMSunil Byrisetty1 min read
రెండోదశ ల్యాండు పూలింగులో ఎన్నో అనుమానాలు !
రెండోదశలో తీసుకునే భూములను ఎప్పటిలోపు అభివృద్ధి చేస్తారు ? ప్లాట్లు ఎక్కడ ఇస్తారు.? ఏ పద్దతుల్లో ఇస్తారు ? భూ సమస్యలు ఎలా పరిష్కరిస్తారనే అంశాలపై రైతుల్లో పెద్దఎత్తున అనుమానాలు వ్య
రెండోదశలో తీసుకునే భూములను ఎప్పటిలోపు అభివృద్ధి చేస్తారు ? ప్లాట్లు ఎక్కడ ఇస్తారు.? ఏ పద్దతుల్లో ఇస్తారు ? భూ సమస్యలు ఎలా పరిష్కరిస్తారనే అంశాలపై రైతుల్లో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండోదశ పూలింగు ప్రారంభమైనా రైతుల నుండి స్పందన తక్కువగా ఉంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఇతర అధికారులు వెళ్లి సభలు పెట్టిన సమయంలో జిరాక్స్ కాపీలు ఇవ్వండి చాలూ, మిగిలిన విషయాలు తరువాత అధికారులు చూసుకుంటారని చెప్పి రైతుల నుండి భూములకు సంబంధించిన పట్టాల జిరాక్సులు తీసుకున్నారు. దీంతో భారీగా స్పందన వచ్చిందని చెప్పి ప్రకటనలు చేశారు. మద్దూరు, యండ్రాయిలో అనూహ్య స్పందన వచ్చిందని ప్రకటించారు. తరువాత రైతుల్లో పెద్దఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలోపు అభివృద్ధి చేస్తారనే కాలపరిమితి పై మంత్రిగానీ, అధికారులుగానీ స్పష్టత ఇవ్వడం లేదు. గత పూలింగు అనంతరం ప్రభుత్వం మారడంతో అభివృద్ధి నిలిచిపోయిందని, భవిష్యత్లో అటువంటి పరిస్థితి రాకుండా తమకు చట్టపరంగా గ్యారంటీ కావాలని వారు కోరుతున్నారు. దరఖాస్తు, అగ్రిమెంటులోనే ఎప్పటిలోపు అభివృద్ధి చేస్తామనే అంశాన్ని చేర్చాలని కోరుతున్నారు. ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తారనే సందేహమూ వారిలో ఉంది. ప్రస్తుతం వడ్డమాను పశ్చిమదిశగా, పెదమద్దూరు కొండకు తూర్పుదిశగా ఇన్నర్రింగురోడ్డు వెళు తోంది. ఈ రోడ్డుకు ఎటువైపు భూములు కేటాయిస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. దీని పై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.