News18th Jun 10:56 AMSunil Byrisetty1 min read

అమ్మవారికి పూజలు చేసిన జాతీయ మహిళా కమిషన్ మెంబర్ అర్చన

జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డా. అర్చన ఏపీలో పర్యటించారు. విజయవాడలోని దుర్గమ్మ వారి ఆలయానికి జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డాక్టర్ అర్చన మంజుందార్ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశార

అమ్మవారికి పూజలు చేసిన జాతీయ మహిళా కమిషన్ మెంబర్ అర్చన
జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డా. అర్చన ఏపీలో పర్యటించారు. విజయవాడలోని దుర్గమ్మ వారి ఆలయానికి జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డాక్టర్ అర్చన మంజుందార్ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వీరిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం,చిత్రపటం ప్రసాదములను అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ పాల్గొన్నారు. జాతీయ మహిళా కమిషన్ మెంబర్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక పోలీస్ మహిళా అధికారి, రెవెన్యూ మహిళా అధికారి అధికారి వీరికి ప్రత్యేకి ఏర్పాట్లు చేసిన వారిలో ఉన్నారు.
Andhra Pradesh news
Vijayawada
Durgamma temple
National Women's Commission Member Dr. Archana
Rayapati Sailaja
అర్చన మంజుందార్ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు
Scroll for the next article