Education26th Apr 03:37 PMSunil Byrisetty1 min read

పది పరీక్షల్లో మెరిసిన గురజాల విద్యార్థులు.. అభినందించిన వైసీపీ నేత

అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఇలానే విద్యను అభ్యసించాలని చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్స్ అధినేత డా. చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. పల్నాడు హాస్పిటల్‌లో గురజాల న

పది పరీక్షల్లో మెరిసిన గురజాల విద్యార్థులు.. అభినందించిన వైసీపీ నేత
అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఇలానే విద్యను అభ్యసించాలని చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్స్ అధినేత డా. చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. పల్నాడు హాస్పిటల్‌లో గురజాల నియోజకవర్గం పరిధిలోని పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల మండలాలలో పదో తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు హాస్పిటల్ అధినేత, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డా. చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే లక్ష్యాల వైపు విద్యార్థులు నడవటం అభినందించిన తగ్గ విషయం అన్నారు. గవర్నమెంట్ స్కూలులో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారందరినీ వైసీపీ తరఫున, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ లాయర్ ధారా చెన్నయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Gurajala
Dr. Chintalapudi Ashok Kumar
Chintalapudi Charitable Trust
tenth class students
పల్నాడు హాస్పిటల్స్ అధినేత డా. చింతలపూడి అశోక్ కుమార్
వైయస్ఆర్ సీపీ
Scroll for the next article