News31st May 02:49 PMSunil Byrisetty1 min read

పొగాకుకి దూరంగా ఉండండి!

ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీ శ పిలుపునిచ్చారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రతి ఒక

పొగాకుకి దూరంగా ఉండండి!
ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీ శ పిలుపునిచ్చారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసి పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని డా. జి. లక్ష్మీశ కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ప్రాంగణలో వైద్య ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ, స్వచ్చంద సంస్థల సహకారంతో పొగాకు వల్ల కలిగే నష్టాల పై ముద్రించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో శరీరంలోని అన్ని అవయవాలకు నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్‌తో పాటు పక్షవాతము, అంధత్వము, రక్తనాళాలు గట్టిపడటం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అనంతరం పొగాకు ఉత్పత్తుల నుండి రక్షించేందుకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేయించారు.
Andhra Pradesh news
Vijayawada
Dr. G.Lakshmisha
No Tobacco Day
awareness posters
పొగాకుకి దూరంగా ఉండండి
పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని డా. జి. లక్ష్మీశ కోరారు
Scroll for the next article