News29th Dec 05:34 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ సలహాదారుగా డా. మంతెన
ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రకృతి వైద్యులు డా. మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదా
ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రకృతి వైద్యులు డా. మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. మంతెనతో పాటు పోచంపల్లి శ్రీధరరావు (మాస్ కమ్యూనికేషన్)ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. రెండేళ్ల పాటు వీరు తమ పదవుల్లో కొనసాగనున్నారు.