News17th Oct 05:27 PMSunil Byrisetty1 min read

కడప కూటమి మేయర్ అభ్యర్థిగా డా. మట్లి సువర్ణ

కడప ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, కూటమి అధిష్టానం, అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు మేయర్ అభ్యర్థిగా డా. మట్లి సువర్ణ పేరును ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ర

కడప కూటమి మేయర్ అభ్యర్థిగా డా. మట్లి సువర్ణ
కడప ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, కూటమి అధిష్టానం, అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు మేయర్ అభ్యర్థిగా డా. మట్లి సువర్ణ పేరును ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఉన్నత విద్యావంతురాలు, మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ డాక్టర్ మట్లి సువర్ణని ఎంపిక చేశారని తెలిపారు. ఆమె భర్త డా. మధుసూదన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా కడప ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అందరి ఆదరణ పొందిన కుటుంబమని పేర్కొన్నారు. కడపలో మహిళా ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో, కార్పొరేషన్ పీఠంపై కూడా చదువుకున్న మహిళా మేయర్ వస్తే నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గత 20 ఏళ్లుగా కార్పొరేషన్‌లో వైసీపీ అవినీతి, అక్రమాలు, దోపిడీ తప్ప చేసిందేమీ లేదని, రాష్ట్రంలోనే అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయిన చరిత్ర వారి మేయర్‌దని మండిపడ్డారు. మరోవైపు హత్యారాజకీయాలు, భూకబ్జాలు, ఇప్పటికీ 307 కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి భార్యను వైసీపీ అభ్యర్థిగా నిలిపిందని తీవ్రంగా విమర్శించారు. నేర చరిత్ర ఉన్నవారిని తరిమికొట్టి, స్వచ్ఛమైన సేవలందించే డాక్టర్ మట్లి సువర్ణ గారికి, 66 డివిజన్ల కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కడప ప్రజలకు పిలుపునిచ్చారు.
Scroll for the next article