News26th Oct 01:15 PMSunil Byrisetty1 min read
తిరుపతి జడ్పీ పీఠంపై పనబాక వారసురాలు?
తిరుపతి జడ్పీ పీఠంపై డాక్టర్ పనబాక చేతన పేరు బలంగా వినిపిస్తోంది.. చైర పర్సన్ రేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి రూరల్ జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్న
తిరుపతి జడ్పీ పీఠంపై డాక్టర్ పనబాక చేతన పేరు బలంగా వినిపిస్తోంది.. చైర పర్సన్ రేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి రూరల్ జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ పనబాక చేతన పేరు తిరుపతి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్న వారి జాబితాలో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీటీడీ బోర్డు సభ్యురాలిగా, జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఆమె కుమార్తె డా. చేతన పేరు జడ్పీ చైర్మన్ పదవికి తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైద్యురాలిగా, ఉన్నత విద్యావంతురాలిగా గుర్తింపు పొందిన డా. చేతనకు ఈ కీలక బాధ్యత దక్కుతుందా? తిరుపతి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికలో పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే చర్చలు జరుగుతున్నాయి.