News11th Jul 10:00 AMSunil Byrisetty1 min read
ప్రజలకు సమాచారమే శక్తి.. పరిరక్షణే అధికారుల బాధ్యత
సమాచార హక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేసి, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం స్పష్టం చేశారు. ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రత
సమాచార హక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేసి, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం స్పష్టం చేశారు. ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి చట్టబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు.విజయవాడలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను డా. రెహానా బేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధనల అమలు, ప్రజా సమాచార అధికారుల (పీఐవోలు) నియామకం, అప్పీలేట్ అధికారుల వివరాల ప్రదర్శన, సమాచార హక్కు దరఖాస్తులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. తొలుత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో భేటీ అయ్యారు. అనంతరం డీఆర్‌వో కార్యాలయాన్ని సందర్శించి స.హ. చట్టం, 2005 అమలుతీరుతెన్నులను పరిశీలించారు. సమాచార హక్కు చట్టం కేవలం సమాచారం అందించే చట్టం మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే కీలక సాధనమన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ముందస్తుగా అందుబాటులో ఉంచితే సమాచార హక్కు దరఖాస్తులు, అప్పీళ్ల సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపారు.