News4th Aug 09:12 AMSunil Byrisetty1 min read
టిడ్కో గృహాల వద్ద డ్రైనేజిల నిర్మాణం
రాజధాని ప్రాంతమైన మంగళగిరి టిడ్కో వాసుల మురుగునీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. టిడ్కో సముదాయంలో కోట్లాది రూపాయల వ్యయంతో కల్వర్టు లు, డ్రైనేజి కాలువల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతో
రాజధాని ప్రాంతమైన మంగళగిరి టిడ్కో వాసుల మురుగునీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. టిడ్కో సముదాయంలో కోట్లాది రూపాయల వ్యయంతో కల్వర్టు లు, డ్రైనేజి కాలువల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతోన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన టిడ్కో గృహ సముదాయానికి కూటమి ప్రభుత్వంలో మహర్దశ పట్టింది. ఇప్పటికే గృహ సముదాయంలో సుమారు రూ. 6.50 కోట్లతో ఆధునిక పార్క్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షం నీరు నిలిచి టిడ్కో వాసులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ టిడ్కో వాసుల ఇబ్బందులపై స్పందించి నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేసి యుద్ధప్రాతిపదికన వర్షం నీటి మళ్లింపు పనులు చేయించిన విషయం విదితమే. టిడ్కో కాలనీ వాసుల శాశ్వత మురుగునీటి కష్టాలకు చెక్ పెట్టాలనే యోచనతో టిడ్కో సముదాయంలో సీసీ కల్వర్టుల నిర్మాణంతో పాటు డ్రైనేజిల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. టిడ్కో సముదాయంలోని సీసీ డ్రైనేజి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.