News31st Dec 11:36 AMSunil Byrisetty1 min read
తాగినంత మందు.. తిన్నంత విందు.. న్యూ ఇయర్ ఆఫర్
గుడివాడ తాగినోడికి తాగినంత.. తిన్నోడికి తిన్నంత.. గుడివాడ పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ న్యూ ఇయర్ వేడుకలకు ఇచ్చిన ప్రత్యేక ఆఫర్ ఇది. డిసెంబరు 31 బుధవారం రాత్రి 7 నుంచి 11.30 గ
గుడివాడ తాగినోడికి తాగినంత.. తిన్నోడికి తిన్నంత.. గుడివాడ పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ న్యూ ఇయర్ వేడుకలకు ఇచ్చిన ప్రత్యేక ఆఫర్ ఇది. డిసెంబరు 31 బుధవారం రాత్రి 7 నుంచి 11.30 గంటల వరకు కేవలం రూ.2 వేలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి. అనుమతి తీసుకున్న సదరు బార్ అండ్ రెస్టారెంట్ స్థలంలో కాకుండా వేరేచోట పార్టీ ఏర్పాటు చేస్తారు. తాగిన వారికి తాగినంత, తిన్నవారికి తిన్నంత.. నాలుగున్నర గంటలపాటు మస్తుగా ఎంజాయ్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా సింగర్లను కూడా రప్పిస్తున్నారు. ఎవరూ ఆడ్డు చెప్పకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు సమాచారం. దీంతో రాత్రంతా ఖుషీ చేసుకోవడానికి మందుబాబులు సిద్ధమైపోతున్నారు.