News26th Oct 11:10 AMSunil Byrisetty1 min read
కర్నూలు బస్సు ప్రమాదంలో ఏ1గా డ్రైవర్
కర్నూలు బస్సు ప్రమాదంలో ఏ1గా డ్రైవర్ లక్ష్మయ్యను పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేసులో ఇద్దరిని నిందితులను పోలీసులు చేర్చారు. ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావే
కర్నూలు బస్సు ప్రమాదంలో ఏ1గా డ్రైవర్ లక్ష్మయ్యను పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేసులో ఇద్దరిని నిందితులను పోలీసులు చేర్చారు. ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరి ట్రావెల్స్ యజమానిని పేర్కొన్నారు. రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్‌ఐఆర్లో పేర్కొన్నారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదైంది. BNS 125(a), 106(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.