News4th Dec 04:23 PMSunil Byrisetty1 min read

డ్రోన్ల ద్వారా అసుపత్రులకు మందులు

వైద్య సేవల్లో డ్రోన్లు వినియోగించేందుకు సదరు సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రయోగాత్మకంగా గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేం

డ్రోన్ల ద్వారా అసుపత్రులకు మందులు
వైద్య సేవల్లో డ్రోన్లు వినియోగించేందుకు సదరు సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రయోగాత్మకంగా గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా నిర్దేశించిన ప్రాథమిక, సామాజిక, ఏరియా ఆరోగ్య కేంద్రాలకు మందులు, బ్లడ్ యూనిట్లు పంపించాలని అధికారులు యోచిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్లు పంపుతున్న సంస్థ 'ప్రూఫ్ అఫ్ కాన్సెప్ట్' కింద ఉచితంగా 9 నెలలపాటు రాష్ట్రంలో సేవలందించేందుకు ముందుకొచ్చిందని అధికారులు తెలిపారు. ఉన్నతస్థాయిలో ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో డ్రోన్ల సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ వ్యవధిలో బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పాడేరుకు తెప్పించేందుకు సులువవుతుంది. ప్రస్తుతం పాడేరు నుంచి దూర ప్రాంతాల్లోని అసుపత్రులకు వాహనాల ద్వారా లేదా సిబ్బంది ద్వారా మందులను పంపుతున్నారు.
Andhra Pradesh Health
Drone Medical Delivery
Paderu
Alluri Sitarama Raju District
Healthcare Innovation
Medicine Transport
Blood Unit Delivery
Emergency Services
అత్యవసర వైద్య సేవలు
గ్రామీణ ఆరోగ్యం
డ్రోన్ టెక్నాలజీ
ఆరోగ్య కేంద్రాలు
వైద్య లోజిస్టిక్స్
Scroll for the next article