News5th Jan 11:51 AMSunil Byrisetty1 min read
డ్రోన్‌తో వల.. జూదరులు విలవిల!
ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న తమను ఎవరు పట్టుకుంటారులే అని ధీమాగా పేకాట ఆడుతున్న వారు.. ఆకాశం నుంచి నిఘా పెట్టిన డ్రోన్‌కు చిక్కారు. తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు పర్యవేక్షణలో ఎస్
ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న తమను ఎవరు పట్టుకుంటారులే అని ధీమాగా పేకాట ఆడుతున్న వారు.. ఆకాశం నుంచి నిఘా పెట్టిన డ్రోన్‌కు చిక్కారు. తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు పర్యవేక్షణలో ఎస్సై ప్రదీప్ సాయి కుమార్ ఆధ్వర్యంలో పలువురు పోలీస్ సిబ్బంది పేకాట స్థావరంపై డ్రోన్ నిఘా పెట్టారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నది వెంబడి నిర్మానుష్య ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 51 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో తాడేపల్లి తో పాటు విజయవాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని, పేకాట వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.