Crime27th Mar 05:26 PMSunil Byrisetty1 min read

టెక్నాలజీతో పోలీసింగ్.. ఏపీలో క్రైం క్లోజ్!

గత ప్రభుత్వంలో పోలీసుశాఖను నిర్వీర్యం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హోం శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన రోజున శాఖ పరిస్థితిని చూసి చాలా భయపడ్డానని తెలిపారు. ఆధునిక ట

టెక్నాలజీతో పోలీసింగ్.. ఏపీలో క్రైం క్లోజ్!
గత ప్రభుత్వంలో పోలీసుశాఖను నిర్వీర్యం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హోం శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన రోజున శాఖ పరిస్థితిని చూసి చాలా భయపడ్డానని తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో పోలీసుశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో చిన్న సంఘటన జరిగినా టెక్నాలజీతో వాటిని ఛేదిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు ఏపీ హోంశాఖ మంత్రి అనిత ఆ పోస్టులో విజిబుల్ పోలీసింగ్, ఇన్ విజిబుల్ పోలీసింగ్ అన్న దానికి చెబుతున్న ఘటన ఇది అంటూ పేర్కొన్నారు. ఎవరికీ దొరక్కుండా లారీలో పేకాట ఆడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సహాయంతో గుర్తించి అరెస్టు చేశారని అన్నారు. ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత షేర్ చేసిన ఈ వీడియోని చూసిన ఏపీ ప్రజలు పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు.
Crime
Police
AP News
హోంమంత్రి వంగలపూడి అనిత
Scroll for the next article