Health18th Mar 05:02 PMSunil Byrisetty1 min read
యూపీహెచ్సీలో డ్రోన్ వైద్య సేవలు ప్రారంభం
మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో ఎయిమ్స్ సహకారంతో మంగళవారం డ్రోన్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి హాజర
మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో ఎయిమ్స్ సహకారంతో మంగళవారం డ్రోన్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి.
ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి హాజరై డ్రోన్ సేవలను ప్రారంభించారు.
అనంతరం డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు.
ఎయిమ్స్ పైలట్ ప్రాజెక్టుగా ఇందిరా నగర్ యూపీహెచ్సీ నుంచి డ్రోన్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు.
ప్రతి మంగళవారం డ్రోన్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. యూపీహెచ్సీలో 60 రకాల రక్త పరీక్షలు, 172 రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.
యూపీహెచ్సీలో అందుబాటులో లేని షుగర్ కు సంబంధించిన హెచ్బిఏవన్సీ పరీక్షలకు సంబంధించిన రక్త నమూనాలను రోగుల నుండి సేకరించి డ్రోన్ సహాయంతో ఎయిమ్స్ కు పంపించడం జరుగుతుందన్నారు. నమూనాలకు సంబంధించిన రిపోర్టులను మెయిల్ ద్వారా యూపీహెచ్సీకి పంపిస్తారన్నారు. షుగరు ఉన్నది, లేనిది తెలుసుకోవాలనుకునే వారు డ్రోన్ సహాయంతో అందిస్తున్న వైద్య సేవలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు.