Farmers31st Aug 02:14 PMSunil Byrisetty1 min read

రైతులకు స్నేహితులు డ్రోన్లు!

వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం రైతుకు శ్రేయస్కరమని, పెట్టుబడిని గణనీయంగా తగ్గించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుపడుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం ద్రాక్షా

రైతులకు స్నేహితులు డ్రోన్లు!
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం రైతుకు శ్రేయస్కరమని, పెట్టుబడిని గణనీయంగా తగ్గించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుపడుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం ద్రాక్షారామంలో వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రామచంద్రపురం, కే.గంగవరం మండలాల వ్యవసాయ యాంత్రీకరణ కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 7 డ్రోన్లను 7 రైతు గ్రూపులకు 68 లక్షల 60 వేలు రూపాయలతో పంపిణీ చేయగా వీటిలో 54 లక్షల 88 వేల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందించిందన్నారు. ఈ మొత్తం వ్యయంలో 13 లక్షల 72 వేల రూపాయలు రైతు వాటాగా చెల్లించారన్నారు. ఇప్పటికే డ్రోన్ల వినియోగంపై పైలట్లకు 15 రోజులు పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి వ్యవస్థకు దార్శనికత కలిగిన నాయకుడు అవసరమని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధన కొరకు ముందు సాగుతుందన్నారు. దీనిలో భాగంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకుని వచ్చి ఆధునిక సాంకే తికతను జోడిస్తూ పెట్టుబడి ఖర్చులను లేబర్ సమస్యను అధిగమించే దిశగా ముందుకు సాగుతుందన్నారు. డ్రోన్‌లు కష్టమైన ప్రదేశాలలో లేదా పెద్ద పొలాలలో విత్తనాలను వేగంగా, సమర్థవంతంగా చల్లగలవన్నారు. సాంప్రదాయ పద్ధతుల కంటే ఇది చాలా వేగంగా పనిచేయడం జరుగుతుందన్నారు.
Andhra Pradesh
Agriculture
Drones
Farmers
AgriTech
Subsidy
Innovation
Modern Farming
Kisan Drone
కిసాన్ డ్రోన్
వ్యవసాయ యాంత్రీకరణ
కార్మిక సమస్య పరిష్కారం
Scroll for the next article