Jobs25th Aug 09:34 AMSunil Byrisetty1 min read
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన రేపటి నుంచే!
డీఎస్సీ కాల్ లెటర్లలో జాప్యం నెలకొనడంతో సర్టిఫికెట్ల పరిశీలన ఒక రోజు ముందుకు జరిగింది. డీఎస్సీ మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశ
డీఎస్సీ కాల్ లెటర్లలో జాప్యం నెలకొనడంతో సర్టిఫికెట్ల పరిశీలన ఒక రోజు ముందుకు జరిగింది.
డీఎస్సీ మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాల్ లెటర్ల విడుదలలో ఏర్పడిన జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కాల్ లెటర్లు విడుదల చేసి సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని తొలుత నిర్ణయించారు. కానీ, ఆదివారం అర్థరాత్రి వరకు కాల్ లెటర్లు విడుదల కాలేదు. సోమవారం ఉదయం కాల్ లెటర్లు విడుదల చేయనున్నారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.