News3rd Oct 04:34 PMSunil Byrisetty1 min read

సామాన్య భక్తులే కేంద్రంగా ఉత్స‌వాల ఏర్పాట్లు

ఈ నెల 11వ తేదీ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి నుంచి 20వ తేదీ ఆశ్వ‌యుజ శుద్ధ ద‌శ‌మి వ‌ర‌కు ద‌స‌రా మ‌హోత్స‌వాలు జ‌రగనున్నాయి. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రత,

సామాన్య భక్తులే కేంద్రంగా ఉత్స‌వాల ఏర్పాట్లు
ఈ నెల 11వ తేదీ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి నుంచి 20వ తేదీ ఆశ్వ‌యుజ శుద్ధ ద‌శ‌మి వ‌ర‌కు ద‌స‌రా మ‌హోత్స‌వాలు జ‌రగనున్నాయి. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రత, సౌకర్యాలు, సులభ దర్శనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాప‌క‌, దేవాదాయ‌, ఇరిగేష‌న్‌, ఆర్ అండ్ బీ త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి సంయుక్త త‌నిఖీలు నిర్వ‌హించారు. సీత‌మ్మ‌వారి పాదాలు, కేశ‌ఖండ‌న శాల‌, హోల్డింగ్ ఏరియాలు, వినాయ‌క టెంపుల్‌, ర‌థం సెంట‌ర్‌, టోల్‌గేట్‌, ఘాట్‌రోడ్డు మీదుగా న‌డుచుకుంటూ వెళ్లి ఏర్పాట్ల‌ను విస్తృతంగా ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు భ‌ద్ర‌త‌, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఏర్పాట్లు ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దసరా కోసం భక్తుల రాకపోకలు, దర్శనం, క్యూలైన్లు, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ఏఐ ఆధారిత డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటలూ సేవలందించే కమాండ్ కంట్రోల్ కేంద్రాన్నిఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Scroll for the next article