Education19th Sep 12:35 PMSunil Byrisetty1 min read
ఏపీలో 22 నుంచి దసరా సెలవులు!
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఈ మేరకు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వా
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఈ మేరకు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు.