Entertainment19th Nov 01:15 PMSunil Byrisetty1 min read

వెండితెరపై దువ్వాడ‌ జంట‌ 'ప్రేమంటే'

దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. షార్ట్స్, మీమ్స్, రీల్స్‌.. ఎక్క‌డ చూసినా వీళ్లే. ఈ గుర్తింపు తోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పె

వెండితెరపై దువ్వాడ‌ జంట‌ 'ప్రేమంటే'
దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. షార్ట్స్, మీమ్స్, రీల్స్‌.. ఎక్క‌డ చూసినా వీళ్లే. ఈ గుర్తింపు తోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పుడు వెండి తెర‌పై కూడా ప్ర‌త్య‌క్ష్యం కాబోతోంది ఈ జంట‌. ఈనెల 21న విడుద‌ల కాబోతున్న ‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ జంట‌ని చూడొచ్చు. ఇద్ద‌రిదీ అతిథి పాత్రే. కాసేపే తెర‌పై ఉంటారు. కాక‌పోతే ఆ ఎంట్రీ మాత్రం స‌ర్‌ప్రైజింగ్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. నిజానికి ఇటీవ‌ల విడుద‌లైన ఓ సినిమాలో దువ్వాడ జంట‌కు ఇలాంటి ఆఫరే వ‌చ్చింది. కానీ వాళ్లిద్ద‌రూ ఎందుకో ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం ఓకే చేసేశారు. ప్రియ‌ద‌ర్శి, ఆనంది జంట‌గా న‌టించిన సినిమా ఇది. ఇందులో సుమ క‌న‌కాల ఓ కీల‌క పాత్ర పోషించారు.
Duvvada Srinivas
Madhuri
Duvvada vCouple
Premante Movie
Telugu Cinema
Priyadarshi
Anandhi
Suma Kanakala
Guest Appearance
Bigg boss fame
Scroll for the next article