News26th Jun 05:01 PMSunil Byrisetty1 min read
విజయవాడలో డ్వాక్రా బజార్ల ఏర్పాటుకు కృషి
విజయవాడ నగర పరిధిలో డ్వాక్ర సంఘాలు, అభివృద్ది కోసం వారు తయారు చేస్తున్న ఉత్పత్తులు మార్కెటింగ్ చేయటం కోసం డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేస్తున్నట్లు విజయ
విజయవాడ నగర పరిధిలో డ్వాక్ర సంఘాలు, అభివృద్ది కోసం వారు తయారు చేస్తున్న ఉత్పత్తులు మార్కెటింగ్ చేయటం కోసం డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తద్వారా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ది జరుగుతుందని తెలిపారు. అప్పుడు మాత్రమే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం ఒక కుటుంబంలో ఒక వ్యాపారవేత్త అభివృద్ది చెందుతారని అన్నారు. విజయవాడ మెప్మా డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి అలాగే యువత యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించటం కోసం కుటీర పరిశ్రమల ద్వారా మహిళా సాధికారత సాధించటం కోసం ప్రత్యేకమైన ప్రణాళికలతో పనిచేస్తుందన్నారు.