News25th Oct 01:44 PMSunil Byrisetty1 min read

అడవులను ఆక్రమిస్తే కూటమైనా చర్యలే

ఎక్కడ ఎవరు అడవులను ఆక్రమించినా పార్టీలకు అతీతంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అడవులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టంచ

అడవులను ఆక్రమిస్తే కూటమైనా చర్యలే
ఎక్కడ ఎవరు అడవులను ఆక్రమించినా పార్టీలకు అతీతంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అడవులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వంలో అటవీ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలో అటవీ భూములను ఆక్రమించుకున్నా అప్పటి అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇలాంటి వాటికి కూటమి ప్రభుత్వంలో చోటులేదన్నారు.. పార్టీలు, వ్యక్తులకు అతీతంగా కబ్జాలపై వేగంగా స్పందించాల్సిన బాధ్యత అటవీ అధికారులదే’ అని అన్నారు. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న పవన్ ‘విధి నిర్వహణలో ఎలాంటి భయాలకు తావు ఇవ్వొద్దు. రాష్ట్రంలో అటవీ భూమిపై సమగ్ర సర్వే చేసి ఆక్రమణలకు గురైన భూమి స్వాధీనానికి ఇతర శాఖల సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయండ’ని ఆదేశించారు.
Andhra Pradesh Government
Pawan Kalyan
Forest Encroachment
Environment Protection
Forest Department
అటవీ అధికారులు
భూమి సర్వే
ఆక్రమణ నివారణ
Scroll for the next article