News30th Jun 10:55 AMSunil Byrisetty1 min read

ఇక చిప్‌తో ఈ- పాస్‌పోర్టులు.. నో ట్యాంపరింగ్!

దేశంలో పాస్‌పోర్ట్‌ల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా కొద్ది నగరాలకే పరిమితమైన 'ఈ-పాస్‌పోర్ట్' సేవలను దేశవ్యాప్

ఇక చిప్‌తో ఈ- పాస్‌పోర్టులు.. నో ట్యాంపరింగ్!
దేశంలో పాస్‌పోర్ట్‌ల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా కొద్ది నగరాలకే పరిమితమైన 'ఈ-పాస్‌పోర్ట్' సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. 'పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్‌పీ) 2.0' కింద ఈ అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. ఈ-పాస్‌పోర్ట్ అంటే ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్. ఇది సాధారణ పాస్‌పోర్ట్ పుస్తకంతో పాటు ఒక ఎలక్ట్రానిక్ చిప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ చిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత వివరాలతో పాటు వారి బయోమెట్రిక్ సమాచారం నిక్షిప్తం చేసి ఉంటాయి. పాస్‌పోర్ట్ ముందు కవర్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్, ఒక యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ కారణంగా ఈ-పాస్‌పోర్టులను నకిలీ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు.
Andhra Pradesh news
E Passport
Chip Based Passport in AP
Passport Seva 2.0
Easy immigration
ఏపీలో ఈ-పాస్‌పోర్టులు జారీ
విశాఖపట్నం
విజయవాడలో ప్రారంభం
Scroll for the next article