Entertainment24th Jul 09:20 AMSunil Byrisetty1 min read
పవనన్న స్వాగ్ అంటే ఇష్టం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా గురించి విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో చేసిన పోస్టులో ''మా పవన్ అన
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా గురించి విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎక్స్ లో చేసిన పోస్టులో
''మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని లోకేశ్ పేర్కొన్నారు. మరోవైపు సినిమాపై అంచనాలకు తగినట్లుగా ఓపెనింగ్స్ ఉన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సినిమా పోస్టర్ ను షేర్ చేసి ఘనవిజయం సాధిస్తుందని పేర్కొన్నారు.