News22nd Mar 03:51 PMSunil Byrisetty1 min read
ఆపరేషన్ గరుడ.. దొరికితే ఇక అంతే
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీస్‌పై అధికారులు దాడులు చేస్తున్నారు. ఏపీలో ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్, విజిలెన్స్ ఎండ్
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీస్‌పై అధికారులు దాడులు చేస్తున్నారు.
ఏపీలో ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి.
డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్, విజిలెన్స్ ఎండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తు్న్నారు.
డ్రగ్స్ దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు గరుడ సిద్ధమైంది.
మెడికల్ షాపుల్లో అక్రమ మత్తుపదార్థాలు ఉన్నాయా అనే దానిపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ గరుడలో భాగంగా ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ ఆధ్వర్యంలో జిల్లాలో మెడికల్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాపుల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ దుకాణాలపై ఆపరేషన్ గరుడలో భాగంగా 100 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు.