International2nd Jan 03:09 PMSunil Byrisetty1 min read
పాక్‌పై కేంద్ర మంత్రి జై శంకర్ ఫైర్
పాకిస్థాన్‌పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఒక "చెడ్డ పొరుగు దేశం" అని అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజలను కాపాడుకునే హక్కు భారత్‌కు ఉందని, ఆ హక
పాకిస్థాన్‌పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఒక "చెడ్డ పొరుగు దేశం" అని అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజలను కాపాడుకునే హక్కు భారత్‌కు ఉందని, ఆ హక్కును తాము వినియోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గతేడాది పహల్గామ్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జరిపిన దాడి తర్వాత, భారత్ "ఆపరేషన్ సిందూర్" చేపట్టిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. "మేము మా హక్కును ఎలా వినియోగించుకుంటామనేది మా ఇష్టం. ఏం చేయాలో, ఏం చేయకూడదో ఎవరూ మాకు చెప్పలేరు. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఏం చేయాలో అది చేస్తాం" అని ఆయన అన్నారు. పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా, పశ్చాత్తాపం లేకుండా ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. సింధు జలాల ఒప్పందం గురించి కూడా జైశంకర్ మాట్లాడారు. "చాలా ఏళ్ల క్రితం మనం నీటి పంపకాల ఒప్పందానికి అంగీకరించాం. కానీ, మంచి సంబంధాలు లేనప్పుడు, దాని ప్రయోజనాలు కూడా ఉండవు. నాతో నీళ్లు పంచుకో, కానీ నేను నీపై ఉగ్రవాదాన్ని కొనసాగిస్తాను అంటే కుదరదు" అని ఆయన స్పష్టం చేశారు.