News4th Apr 10:23 AMSunil Byrisetty1 min read

జపాన్కు హై అలర్ట్.. భూకంపం ప్రమాదం

మయన్మార్లో ఇటీవల 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. దాదాపు 3 వేల మంది మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. త్వరలో జపాన్ దేశంలో అ

జపాన్కు హై అలర్ట్.. భూకంపం ప్రమాదం
మయన్మార్లో ఇటీవల 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. దాదాపు 3 వేల మంది మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. త్వరలో జపాన్ దేశంలో అంతకుమించిన స్థాయిలో భూకంపం విలయం సృష్టించే ప్రమాదం ఉందని సంకేతాలు వస్తున్నాయి. జపాన్లో త్వరలోనే అతిపెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు తీసుకుంటుందని చెబుతున్నారు. జపనీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విపత్తు భారీ విధ్వంసానికి కారణమవుతుందని, సునామీలు సంభవించి ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేశారు. గతంలో జపాన్లో వచ్చిన సునామీలో వేల మంది చనిపోయారు.
Earthquake In Japan
Alert
సునామీ
Scroll for the next article