News28th Mar 02:57 PMSunil Byrisetty1 min read

మ‌య‌న్మార్, థాయ్ ల్యాండ్ దేశాల‌లో భారీ భూక‌పం

మ‌య‌న్మార్, థాయ్ ల్యాండ్ దేశాల‌లో భారీ భూక‌పం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రత 7.7గా న‌మోదైంది. ఈ భూకంపం ధాటికి ఆయా దేశాల‌లో బారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచార

మ‌య‌న్మార్, థాయ్ ల్యాండ్ దేశాల‌లో భారీ భూక‌పం
మ‌య‌న్మార్, థాయ్ ల్యాండ్ దేశాల‌లో భారీ భూక‌పం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రత 7.7గా న‌మోదైంది. ఈ భూకంపం ధాటికి ఆయా దేశాల‌లో బారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం. దీని తీవ్రత‌కు ప‌లు భ‌వ‌నాలు కుప్పకూలాయి. ప్రజలు ఇళ్ల నుంచి భ‌యంతో ప‌రుగులు తీశారు. మ‌రికొంద‌రు ప్రాణాలు రక్షించేందుకు ఈత కొల‌నుల‌లో దూకారు.. ఇక బ్యాంకాంక్‌లో ఈ భూకంప తీవ్రత 7.3గా న‌మోదైంది. ఈ న‌గ‌రంలో అనేక భ‌వ‌నాలు నేల‌మ‌ట్ట‌మైన‌ట్లు అక్కడి మీడియా వెల్లడించింది.. స‌హాయ కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.. వంద‌లాది మంది క్షత‌గాత్రుల‌ను స‌మీపంలోని హాస్పిట‌ల్స్‌కు త‌ర‌లిస్తున్నారు.. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.. కాగా, ఈ దేశాలలో ముందు జాగ్రత్త చర్యలుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ భూకంప ప్రభావం భారతదేశంలోనూ కనిపించింది. గౌహతి, కోల్‌కాతా, మిజోరం, తదితర ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి.
Myanmar Earthquake
థాయ్ ల్యాండ్
కోల్‌కాతా
భూక‌పం
Scroll for the next article