Health21st Jul 05:29 PMSunil Byrisetty1 min read
జంక్ ఫుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త!
ఒకప్పుడు మహా నగరాలకు పరిమితమైన జంక్ ఫుడ్ నేడు గ్రామగ్రామాలకూ విస్తరించింది. 1996లో నేడు దేశంలో దాదాపు 400 వరకు పేరుమోసిన ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లు నడుస్తున్నాయి. జంక్ ఫుడ్ను ప్యాకెట్లల
ఒకప్పుడు మహా నగరాలకు పరిమితమైన జంక్ ఫుడ్ నేడు గ్రామగ్రామాలకూ విస్తరించింది. 1996లో నేడు దేశంలో దాదాపు 400 వరకు పేరుమోసిన ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లు నడుస్తున్నాయి. జంక్ ఫుడ్ను ప్యాకెట్లలో పెట్టి అమ్మేస్తున్నాయి. ఇప్పుడు ఆ జంక్ ఫుడ్ ప్రజల ఆరోగ్యాలను కాటు వేస్తున్నది. బర్గర్లు, పిజ్జాలు, వైట్ బ్రెడ్, ఫ్రైస్, కుకీస్, పొటాటో చిప్స్, ఐస్ క్రీమ్స్, శీతల పానీయాలు, చాకొలేట్స్, ప్రాసెస్డ్ మీట్, స్ట్రీట్ ఫాస్ట్ ఫుడ్స్ లాంటిరూపాల్లో జంక్ ఫుడ్స్ మార్కెట్లను ముంచెతున్నాయి. భారత్లో ప్రతి ఏటా జంక్ ఫుడ్ వినియోగం 10 శాతం వరకు పెరగడంతో పాటు 93 శాతం వరకు పిల్లలు వారానికి రెండు పూటలు జంక్ ఫుడ్, 56 శాతం పిల్లలు ఐస్క్రీమ్స్, చాకో లెట్స్ తింటున్నారు. కౌమార యువత రోజుకు ఒక్కసారైనా ప్యాకెట్ ఫుడ్స్ తింటున్నట్లు, 40శాతం పిల్లల లంచ్ బాక్సుల్లో ప్యాకెట్ ఫుడ్స్ ఉంటున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ఇంటి వంటలే ఆరోగ్యానికి మంచిదని, జంక్ ఫుడ్ ను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి.