Politics7th Sep 10:28 AMSunil Byrisetty1 min read

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు

2026 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఫలితాలు ప్రకటించేలా షెడ్యూల్ సి

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు
2026 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఫలితాలు ప్రకటించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలని, నవంబర్ 15లోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేసి, ఈవీఎంలు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ 15లోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది.
Andhra Pradesh
Local Body Elections 2026
State Election Commission
Neelam Sahni
Ward Delimitation
Voter List
Polling Stations
EVMs
Reservation Process
Upcoming Elections
గ్రామ పంచాయతీ ఎన్నికలు
ఎన్నికల నోటిఫికేషన్
ఓటర్ల జాబితా 2025
Scroll for the next article