News26th Aug 04:42 PMSunil Byrisetty1 min read

అన్న క్యాంటీన్ అద్భుతం

విజయవాడ నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్

అన్న క్యాంటీన్ అద్భుతం
విజయవాడ నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి బుధవారం మధ్యాహ్నం పటమటలోని అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచి, నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న సేవలను ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ అభినందించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసిన అనంతరం ఆయన తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫీడ్‌బ్యాక్ నమోదు చేశారు. “భోజనం చాలా రుచికరంగా ఉంది. ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. నేను అన్నం, సాంబార్ మరియు కూరను ఆస్వాదించాను. అన్న క్యాంటీన్లో పరిశుభ్రత అద్భుతంగా ఉంది. ఆల్ ది బెస్ట్” అని ఆయన తన ఫీడ్‌బ్యాక్‌లో పేర్కొన్నారు.
Andhra Pradesh
Food Quality
Anna Canteen
Vijayawada
Election Commission of India
Pawan Kumar Sharma
Vivek Yadav
Dhyana Chandra
పరిశుభ్రత
ప్రజా సేవలు
సంక్షేమ పథకాలు
పటమట
ఏపీ ప్రభుత్వం
విజయవాడ వార్తలు
Scroll for the next article