News14th Nov 03:58 PMSunil Byrisetty1 min read

చేనేత, హస్త కళలకు ఆర్థిక దన్ను

చేనేత, హస్త కళాకారులకు ఆర్థిక వెన్నుదన్ను లభించేలా ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సు 202

చేనేత, హస్త  కళలకు ఆర్థిక దన్ను
చేనేత, హస్త కళాకారులకు ఆర్థిక వెన్నుదన్ను లభించేలా ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సు 2025లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ లో చేనేత, జౌళి శాఖలకు చెందిన మూడు స్టాళ్లను గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి మంత్రి ఎస్.సవిత ప్రారంభించారు. ముందుగా హస్తకళా స్టాల్ ను మంత్రులు సవిత, గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. కళాకారులు రూపొందించిన కళారూపాలను పరిశీలించారు. అనంతరం రెండు చేనేత స్టాళ్లను సందర్శించారు. ఓడీ- ఓపీ అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులను పరిశీలించారు. వాటితో పాటు తో ఈ ఈ ఏడాది ఓడీ-ఓపీ అవార్డుల కోసం ఎంపిక చేసిన 34 ఉత్పత్తులను తిలకించారు. చేనేత, హస్త కళాకారులకు ఆర్థిక ఉన్నతి కల్పించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు. అంతకుముందు సీఐఐ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య కళా ప్రదర్శనలను మంత్రి సంధ్యారాణితో కలిసి మంత్రి సవిత తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వ, జిల్లా బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖాధికారులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Handloom
Handicrafts
Economic Support
Textile Department
Minister Savitha
Minister Sandhya Rani
CII Summit 2025
AP Pavilion
ఓడీ-ఓపీ అవార్డులు
కళాకారుల ప్రోత్సాహం
లేపాక్షి
Scroll for the next article