News17th Oct 03:02 PMSunil Byrisetty1 min read
ఎకో సిస్టం అభివృద్ధికి రాయితీలు ఇవ్వాలన్న పెమ్మసాని
విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటుపై పలు రాష్ట్రాల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఎకో సిస్టం అభివృద్ధికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకసారి ఎకో
విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటుపై పలు రాష్ట్రాల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఎకో సిస్టం అభివృద్ధికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకసారి ఎకో సిస్టం ఏర్పాటయ్యాక రాయితీలు ఇవ్వాల్సిన పని ఉండదని చెప్పారు. బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఎకో సిస్టం ఏర్పాటైందని.. విశాఖతో పోలిక అవసరం లేదని వివరించారు. గూగుల్ సంస్థ ఏర్పాటు తర్వాత చాలా సంస్థలు పెట్టుబడులకు వస్తున్నాయన్నారు. పోస్టల్ డిపార్టుమెంట్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం.. రూ.5 వేల కోట్లతో పోస్టల్ సంస్థ నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే కాలంలో పోస్టల్ సంస్థను ఆదాయం అందించే సంస్థగా తీర్చిదిద్దుతామని పెమ్మసాని వివరించారు.