News6th Oct 03:49 PMSunil Byrisetty1 min read

ఎకో టూరిజం ప్రాజెక్టులతో కొత్త అనుభూతి

రాష్ట్ర ప్రజలను ప్రకృతిలో మమేకం చేసి, వారికి మరిచిపోని మధురానుభూతులను ఇవ్వడంతోపాటు, గిరిజనులకు ఎకో టూరిజం జీవనోపాధులు మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్

ఎకో టూరిజం ప్రాజెక్టులతో కొత్త అనుభూతి
రాష్ట్ర ప్రజలను ప్రకృతిలో మమేకం చేసి, వారికి మరిచిపోని మధురానుభూతులను ఇవ్వడంతోపాటు, గిరిజనులకు ఎకో టూరిజం జీవనోపాధులు మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. నల్లమల నుంచి మారేడుమిల్లి వరకు, బాపట్ల తీర ప్రాంత అందాల నుంచి కోటప్పకొండ ఆధ్యాత్మిక ప్రయాణం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పర్యాటక కళను తీసుకొచ్చేలా పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమైన 6 నగరవనాలను ఉప ముఖ్యమంత్రి మంగళగిరి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ గా ప్రారంభించారు. ‘‘నగర వన యోజన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 నగరవనాలుంటే, ఇప్పుడు ప్రారంభించిన ఆరు నగరవనాలతో కలిపి 25 నగరవనాలు రాష్ట్రంలో ఏర్పడతాయి. 305 హెక్టార్లలో, రూ.13 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ నగరవనాలు కేవలం మొక్కలు నాటే ప్రాంతాలుగా కాకుండా, ప్రజలను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే మార్గంగా ఉంటాయి. నగరవనాల్లో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లు, పిల్లలు ఆడుకునే ప్రాంతాలు, జిమ్ పరికరాలు వంటివి అందుబాటులో ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో, స్వచ్ఛమైన అందాలతో నగరవనాలు ఆరోగ్యం, ఆహ్లాదం, ప్రకృతి అవగాహన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. బాపట్ల, చీరాల తీర ప్రాంత పర్యాటక వనాలుగా ఉంటే, కోటప్పకొండ ఆధ్యాత్మిక సువాసనలతో విరాజిల్లుతుంది. వినుకొండ, దేవరంపాడు, మాచర్లలో ఏర్పాటు చేసే నగరవనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రకృతికి దగ్గరయితే, ఆరోగ్యం దగ్గరవుతుంది. ప్రకృతి అర్ధమైతే, పరిరక్షణ బాధ్యత పెరుగుతుంది. ఇది ప్రకృతి నియమం’’ అని పేర్కొన్నారు.
Scroll for the next article