News19th Sep 02:42 PMSunil Byrisetty1 min read
లిక్కర్ కేసు తేల్చేస్తున్న ఈడీ!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ పలు రాష్ట్రాల్లో సోదాలు చేయడంతో వైసీపీ పెద్దలు ఉలిక్కి పడ్డారు. ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని.. తమ స్కామ్ ఇంటర్నేషనల్ కాబట్టి భయం లేదని.. ఎక్కడ
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ పలు రాష్ట్రాల్లో సోదాలు చేయడంతో వైసీపీ పెద్దలు ఉలిక్కి పడ్డారు. ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని.. తమ స్కామ్ ఇంటర్నేషనల్ కాబట్టి భయం లేదని.. ఎక్కడో చోట తీగ తెగిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈడీ పూర్తి స్థాయిలో హడావుడి లేకుండా చేయాలనుకున్న పనులన్నీ చేస్తోందని క్లారిటీ వచ్చాక.. వారంతా కంగారు పడిపోతున్నారు. తమ దాకా ఎప్పుడు వస్తారా అని బితుకుబితుకు మంటున్నారు.
ఈడీ టార్గెటెడ్‌గా సోదాలు చేసింది. అంటే పక్కా సమాచారంతోనే సోదాలు చేసింది. లిక్కర్ స్కాముల్లో డబ్బులు ఎవరెవరి దగ్గరకు చేరాయి.. వారు ఎలా వైట్ చేశారు.. దానికి ఎన్ని షెల్ కంపెనీలు పెట్టారు..ఇలా మొత్తం సమాచారం ఉండటంతో.. ఆయా చోట్ల సోదాలు చేశారు. పక్కా ఆధారాలతో చేసిన సోదాల్లో.. ఆ లావాదేవీల సమాచారం అంతా వారికి లభించింది. ఈడీ ఇప్పటికే చాలా సైలెంటుగా విచారణ చేస్తూ.. అన్ని డీటెయిల్స్ తెలుసుకుంది.