National9th Nov 01:51 PMSunil Byrisetty1 min read

ఈడీ అంటే 'సూపర్ పోలీస్' కాదు!

ఈడీపై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. YB Ashwathanarayan v. Union of India కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది. తనకు నచ్చిన ప్రతి కేసుల

ఈడీ అంటే 'సూపర్ పోలీస్' కాదు!
ఈడీపై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. YB Ashwathanarayan v. Union of India కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది. తనకు నచ్చిన ప్రతి కేసులోనూ జోక్యం చేసుకుని, స్వతంత్రంగా దర్యాప్తు ప్రారంభించడానికి అధికారం కలిగిన సంస్థ ఈడీ కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ప్రోవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు చట్టం కింద ED అధికారాలు స్వతంత్రమైనవి కావని స్పష్టం చేసింది. అవి ముందుగా నమోదైన ప్రాథమిక నేరం ఆధారంగా మాత్రమే ఉంటాయని కోర్టు పేర్కొంది. అవినీతి లేదా అక్రమం జరిగిందనే సమాచారంపై ED తనంతట తానే క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి అధికారం లేదని కోర్టు అభిప్రాయపడింది. ED కూడా చట్టానికి అతీతం కాదని, అది సూపర్ పోలీస్ కాదని పేర్కొంది.
Scroll for the next article